విష్ణువర్ధన్‌కు నిరాశ | Vishnu Vardhan Disappointed in Nanchang Tourney | Sakshi
Sakshi News home page

విష్ణువర్ధన్‌కు నిరాశ

Apr 25 2019 3:29 PM | Updated on Apr 25 2019 3:29 PM

Vishnu Vardhan Disappointed in Nanchang Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాన్‌చాంగ్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో అతను తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. చైనాలో బుధవారం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో విష్ణు 2–6, 3–6తో ఆండ్రూ హారిస్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్‌ తొలి రౌండ్‌లో విష్ణువర్ధన్‌–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జంట 4–6, 5–7తో సాండెర్‌ ఆరెండ్స్‌ (నెదర్లాండ్స్‌)–వీస్‌బార్న్‌ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో రామ్‌కుమార్‌ 6–3, 6–2తో రిగిలె టి (చైనా)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement