'అతని కెప్టెన్సీ కూడా సెపరేటే' | Virat Kohli's style of captaincy very effective, says Brian Lara | Sakshi
Sakshi News home page

'అతని కెప్టెన్సీ కూడా సెపరేటే'

Feb 6 2017 10:22 AM | Updated on Sep 5 2017 3:03 AM

'అతని కెప్టెన్సీ కూడా సెపరేటే'

'అతని కెప్టెన్సీ కూడా సెపరేటే'

భారత క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడిగా మన్ననలు అందుకుంటున్న విరాట్ కోహ్లిపై వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు.

హైదరాబాద్:భారత క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడిగా మన్ననలు అందుకుంటున్న విరాట్ కోహ్లిపై వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యుతమ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న కోహ్లికి బ్యాటింగ్ లో ప్రత్యేకమైన స్టైల్ ఉందంటూ లారా కొనియాడాడు. విరాట్ బ్యాటింగ్ లో  ఉన్న వైవిధ్యమే అతని పరుగుల ప్రవాహానికి కారణమన్నాడు.

 

'విరాట్ బ్యాటింగ్ చూడ ముచ్చటగా ఉంటుంది. సహజసిద్ధమైన బ్యాటింగ్ అతని సొంతం.  విరాట్ బ్యాటింగే కాదు.. కెప్టెన్సీ కూడా సెపరేటుగానే ఉంటుంది. అతని కెప్టెన్సీ స్టైల్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అది చాలాసార్లు నిరూపించబడింది కూడా 'అని లారా పేర్కొన్నాడు. అయితే విరాట్ బ్యాటింగ్ ను మరొక ఆటగాడితో పోల్చాల్సిన అవసరం లేదన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement