'పోకిరీ' తరహాలో.. కోహ్లీపై సర్ జడేజా ట్వీట్ | Virat Kohli's Daily Routine: Sir Ravindra Jadeja | Sakshi
Sakshi News home page

'పోకిరీ' తరహాలో.. కోహ్లీపై సర్ జడేజా ట్వీట్

Oct 24 2016 5:21 PM | Updated on Sep 4 2017 6:11 PM

'పోకిరీ' తరహాలో.. కోహ్లీపై సర్ జడేజా ట్వీట్

'పోకిరీ' తరహాలో.. కోహ్లీపై సర్ జడేజా ట్వీట్

భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన స్టయిల్లో విరాట్ను ప్రశంసిస్తూనే సరదా ట్వీట్లు చేశాడు.

న్యూజిలాండ్తో మూడో వన్డేలో భారీ సెంచరీ చేసి టీమిండియాను గెలిపించిన విరాట్ కోహ్లీపై ప్రశంసలు వెల్లువెత్తాయి. భారత క్రికెటర్లు, మాజీలు విరాట్ను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన స్టయిల్లో విరాట్ను ప్రశంసిస్తూనే సరదా ట్వీట్లు చేశాడు. 'చాంపియన్ విరాట్ కోహ్లీ రోజూ చేసే పని ఇదే. నిద్ర లేవడం.. తినడం.. సెంచరీ చేయడం.. పడుకోవడం.. ఇదే పని' అంటూ మహేశ్ బాబు సూపర్ హిట్ సినిమాలో పోకిరీలో షయాజీ షిండే చెప్పిన డైలాగ్ మాదిరిగా సర్ జడేజా ట్వీట్ చేశాడు. 'కోహ్లీ న్యూజిలాండ్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్పై సర్జికల్ దాడులు చేశాడు. ఓ ఓవర్లో వరుసగా 4, 2, 4, 6, 2,4 పరుగులు చేశాడు' అంటూ జడేజా మరో ట్వీట్ చేశాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌.. విరాట్ ఎందుకు స్పెషలో మరోసారి నిరూపించుకున్నాడని కితాబిచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకరిని చూశామని, ఛేజింగ్లో విరాట్ ఎప్పటిలాగే మరో సెంచరీ చేశాడని కామెంటేటర్ హర్ష భోగ్లే ట్వీట్ చేశాడు. భారత క్రికెటర్లు హర్భజన్, మహ్మద్ కైఫ్తో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు, మైఖేల్ వాన్.. విరాట్ ఆటతీరును ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement