జడేజాను ట్రోల్‌ చేసిన విరాట్‌ కోహ్లి | Virat Kohli Trolled Ravindra Jadeja on His Latest Instagram Post | Sakshi
Sakshi News home page

రివ్యూ తీసుకోమని అడగలేదు: జడేజా

Jun 10 2020 6:08 PM | Updated on Jun 10 2020 6:13 PM

Virat Kohli Trolled Ravindra Jadeja on His Latest Instagram Post - Sakshi

హైదరాబాద్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్‌ సమయంలో సహచర క్రికెటర్లతో లైవ్‌ సెషన్స్‌లలో పాల్గొని ఫ్యాన్స్‌కు కావాల్సిన వినోదపు విందును అందించాడు. ఇక కొన్ని సరదా సంభాషణల్లోకి పలువురు క్రికెటర్లను లాగి వారిని ఇరకాటంలో పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా తనపై వచ్చే సెటైర్లకు ధీటుగానే బదులిస్తుంటాడు విరాట్‌ కోహ్లి. తాజాగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన ఇన్‌స్టాలో ఓ ఫోటో షేర్‌ చేసి కోహ్లికి చిన్న సెటైర్‌ వేశాడు. (ఆ ఇద్దరిని ఔట్‌ చేయాలి.. ఎలా అంపైర్‌?)

ఆ ఫోటోలో కోహ్లి రివ్యూ కోసం అంపైర్‌కు అప్పీల్‌ చేస్తుండగా పక్కనే జడేజా ఉన్నాడు. ఆ ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘రివ్యూ తీసుకోమని నేను మిమ్మల్ని అడగలేదు’ అంటూ సరదాగా క్యాప్షన్‌ను జతచేశాడు. దీనికి కోహ్లి కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘రివ్యూకు వెళ్లడానికి ముందు అది తప్పకుండా ఔట్‌ అని ప్రతీసారి అంటావు. తీరా సమీక్ష కోరాక సందేహంగా ఉందంటావు’ అంటూ జడేజాను కోహ్లి ట్రోల్‌ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.  ఇక బ్యాట్స్‌మన్‌గా సమీక్ష కోరడంలో కోహ్లి విఫలమవుతాడనే అపవాదు ఉంది. వన్డే ప్రపంచకప్‌-2019లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి డీఆర్‌ఎస్‌ తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. (‘కోహ్లిలా ఆడాలి.. పాక్‌ను గెలిపించాలి’)

Advertisement
 
Advertisement
Advertisement