'లగ్జరీ' బ్రాండ్ అంబాసిడర్గా కోహ్లి

'లగ్జరీ' బ్రాండ్ అంబాసిడర్గా కోహ్లి


బెంగళూరు: ఇక నుంచి టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రముఖ లగ్జరీ రియల్ ఎస్టేట్ సంస్థ నితీష్ ఎస్టేట్స్  బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరించనున్నాడు.  ఈ మేరకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోహ్లి స్పష్టం చేశాడు.  వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న నగరానికి చెందిన ఈ సంస్థకు  బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. తొలి తరం రియల్ ఎస్టేట్ సంస్థ అయిన లగ్జరీ రియల్  ఎస్టేట్స్ అతికొద్ది సమయంలో విశేషమైన ప్రగతిని సాధించిందని  ఈ సందర్భంగా  కోహ్లి పేర్కొన్నాడు.


 


సాధారణ ఇళ్లు, హోటళ్లు, కార్యాలయాలు, భవంతులు విషయంలో ఆ సంస్థ అందిస్తున్న నాణ్యత తనను  విపరీతంగా ఆకర్షించిందన్నాడు. ఈ క్రమంలోనే ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోహ్లి తెలిపాడు. ఇదిలా ఉండగా విరాట్ తో ఒప్పందం తమ కంపెనీ ప్రగతికి మరింత తోడ్పడుతుందని ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్విన్ కుమార్ తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top