-
ఖరీదైన ఇళ్లకు తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ: ఖరీదైన ఇళ్ల విభాగం కళకళలాడుతోంది. కరోనా మహమ్మారి ప్రభావం ఈ విభాగంపై పెద్దగా పడలేదు. రూ.5 కోట్లకు పైగా ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు (ధనవంతులు/హెచ్ఎన్ఐలు) 75 శాతం మంది చెప్పారు. వచ్చే రెండేళ్లలో పెద్ద పట్టణాలు, హాలిడే ప్రదేశాల్లో వీరు ఇళ్లను కొనాలనుకుంటున్నారు. లగ్జరీ హౌసింగ్ అవుట్‌లుక్ 2022 పేరుతో లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ఇండియా సోథెబీ ఇంటర్నేషనల్ రియల్టీ ఒక నివేదిక విడుదల చేసింది. 200 హెచ్ఎన్ఐల అభిప్రాయాల ఆధారంగా దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో (హైదరాబాద్ సహా) రియల్ ఎస్టేట్ ధోరణలపై ఈ సంస్థ నివేదిక రూపొందించింది. సంపన్నుల్లో రియల్ఎస్టేట్ పట్ల ధోరణి మారిందనడానికి ఈ ఫలితాలే నిదర్శమని పేర్కొంది. వచ్చే రెండేళ్లలో కొనుగోళ్లకు సముఖంగా ఉన్నామని చెప్పిన 75 శాతం మంది ప్రాధాన్యతలు గమనిస్తే.. 89 శాతం మంది ఖరీదైన ఇళ్ల పట్ల (సిటీ అపార్ట్మెంట్లు, బంగళాలు, హాలిడే హోమ్స్) ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది ఖరీదైన వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. బుల్లిష్ ధోరణి..: ముఖ్యంగా గడిచిన 18 నెలల్లో ఇల్లు కొనుగోలు చేసినట్టు 26% మంది చెప్పారు. వారి జీవనశైలిని మెరుగుపరుచుకోవడం, మంచి పెట్టుబడులను సొంతం చేసుకునే ఆలోచనతోనే వారు కొన్నారు. గత రెండు మూడేళ్లలో హెచ్ఎన్ఐలు, అల్ట్రా హెచ్ఎన్ఐలు ఖరీదైన ఇళ్లను సొంత వినియోగానికే కొనుగోలు చేశారు. మంచి పెట్టుబడి అవకాశం కోసం కొనుగోలు చేయడం అంటే అది బుల్లిష్ ధోరణికి సంకేతమని సోథెబీ ఇంటర్నేషనల్ రియాలిటీ సీఈవో అమిత్ గోయల్ అన్నారు. భారత్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ సంప్రదాయ ధరల పెరుగుదల క్రమంలో ఉన్నట్టు చెప్పారు. హాలిడే హోమ్స్‌కు ప్రాధాన్యం 29 శాతం మంది హెచ్ఎన్ఐలు హాలిడే హోమ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. లగ్జరీ హాలిడే హోమ్‌కు రూ.5–10 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని 71 శాతం మంది భావిస్తున్నారు. 29 శాతం మంది రూ.10 కోట్ల పైన ధర ఉన్నా ఫర్వాలేదని చెప్పారు. లగ్జరీ అపార్ట్మెంట్ లేదా విల్లా అయితే రూ.10–25 కోట్ల వరకు పెట్టుబడికి సుముఖంగా ఉన్నట్టు 69 శాతం మంది చెప్పారు. 21 శాతం మంది రూ.5–10 కోట్ల బడ్జెట్లో, మిగిలిన 10 శాతం మంది రూ.25 కోట్లకు పైగా బడ్జెట్లో ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నారు. -
'లగ్జరీ' బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లి
బెంగళూరు: ఇక నుంచి టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రముఖ లగ్జరీ రియల్ ఎస్టేట్ సంస్థ నితీష్ ఎస్టేట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరించనున్నాడు. ఈ మేరకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోహ్లి స్పష్టం చేశాడు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న నగరానికి చెందిన ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. తొలి తరం రియల్ ఎస్టేట్ సంస్థ అయిన లగ్జరీ రియల్ ఎస్టేట్స్ అతికొద్ది సమయంలో విశేషమైన ప్రగతిని సాధించిందని ఈ సందర్భంగా కోహ్లి పేర్కొన్నాడు. సాధారణ ఇళ్లు, హోటళ్లు, కార్యాలయాలు, భవంతులు విషయంలో ఆ సంస్థ అందిస్తున్న నాణ్యత తనను విపరీతంగా ఆకర్షించిందన్నాడు. ఈ క్రమంలోనే ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోహ్లి తెలిపాడు. ఇదిలా ఉండగా విరాట్ తో ఒప్పందం తమ కంపెనీ ప్రగతికి మరింత తోడ్పడుతుందని ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్విన్ కుమార్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్‌కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్‌తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్‌క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement