వారిద్దరి కంటే విరాట్ బెస్ట్ | Virat Kohli is Better Than Steven Smith & Joe Root: Andrew Flintoff | Sakshi
Sakshi News home page

వారిద్దరి కంటే విరాట్ బెస్ట్

Mar 16 2017 7:50 PM | Updated on Sep 5 2017 6:16 AM

వారిద్దరి కంటే విరాట్ బెస్ట్

వారిద్దరి కంటే విరాట్ బెస్ట్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ప్రశంసలు కురిపించాడు.

న్యూడిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే విరాట్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అని కితాబిచ్చాడు. స్టీవెన్ స్మిత్, జో రూట్‌ కంటే కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్‌ని ఫ్లింటాఫ్ అన్నాడు.

టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, స్టీవెన్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లను పరిశీలిస్తే.. నలుగురూ అత్యుత్తమ ఆటగాళ్లని, వీరిలో విరాటే బెస్ట్ క్రికెటర్ అని ఫ్లింటాఫ్ చెప్పాడు. టెస్టు క్రికెట్ లో విరాట్ ఆటతీరు, వ్యూహాలు చాలా బాగుంటాయని అన్నాడు. టెస్టు క్రికెట్‌తో పోలిస్తే టి-20లలో కోహ్లీ బ్యాటింగ్ మరింత ఉత్సుకతగా ఉంటుందని చెప్పాడు. అతను రిస్క్ తీసుకోకుండా బౌండరీలతో విజృంభిస్తాడని అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement