విరాట్తో అతన్ని పోల్చడమా?:పీటర్సన్ | Virat Kohli is as good as it gets, says Kevin Pietersen | Sakshi
Sakshi News home page

విరాట్తో అతన్ని పోల్చడమా?:పీటర్సన్

Nov 4 2016 1:34 PM | Updated on Sep 4 2017 7:11 PM

విరాట్తో అతన్ని పోల్చడమా?:పీటర్సన్

విరాట్తో అతన్ని పోల్చడమా?:పీటర్సన్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్రతో చెలరేగిపోతున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి అతనే సాటని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.

లండన్: ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్రతో చెలరేగిపోతున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి అతనే సాటని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. విరాట్ సాధించిన ఘనతలే అతని ప్రతిభకు అద్దం పడుతున్నాయని కొనియాడాడు. అయితే ఇదే క్రమంలో ఇంగ్లండ్ ఆశా కిరణం జో రూట్తో విరాట్ను పోల్చడాన్ని పీటర్సన్ తప్పుబట్టాడు. విరాట్తో జోరూట్ను పోల్చడం అంత సబబు కాదన్నాడు.

' విరాట్ సాధించిన ఘనతలు అతని గొప్పతనాన్ని చాటి చెపుతున్నాయి. రూట్ ఒక మంచి ఆటగాడే. కొన్ని కీలక ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. విరాట్తో జోరూట్ పోలిక సరికాదు. విరాట్ అసాధారణమైన గణాంకాలతో చాలా ముందంజలో ఉన్నాడు. జట్టు కోసం తరచు భారీ స్కోర్లు నమోదు చేస్తూ అసాధారణమైన ఆట తీరును కనబరుస్తున్నాడు.  ఈ రకంగా చూస్తే విరాట్ తో రూట్ పోలిక ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు'అని పీటర్సన్ తెలిపాడు.

త్వరలో భారత జట్టుతో ఇంగ్లండ్ ఆడబోయే సుదీర్ఘ టెస్టు సిరీస్లో రవి చంద్రన్ అశ్విన్ నుంచి ప్రమాదం పొంచి వుందని జట్టును హెచ్చరించాడు. ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించే సత్తా అశ్విన్ సొంతమనే విషయాన్ని మరచిపోకుండా జాగ్రత్తగా ఆడాలన్నాడు.'నేను అశ్విన్ చాలాసార్లు ఎదుర్కొన్నాను. నాకైతే అతని దూస్రా ఓకే.ఒకవేళ అతను దూస్రా ప్రయోగించకుండా వేరే అస్త్రాన్ని ప్రయోగిస్తే మాత్రం ఇంగ్లండ్కు ఇబ్బందులు తప్పవు' అని పీటర్సన్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement