హైదరాబాద్‌ విజయం

Vijay Hazare Trophy Rayudu Set It Up Hyderabad To Victory - Sakshi

బెంగళూరు: కర్ణాటకతో మంగళవారం జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే మ్యాచ్‌లో రాయుడు స్ఫూర్తిదాయక అర్ధ సెంచరీ (111 బంతుల్లో 87 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కదం తొక్కాడు. దీంతో హైదరాబాద్‌ 21 పరుగుల తేడాతో హేమాహేమీలున్న కర్ణాటకపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో హైదరాబాద్‌కిది రెండో గెలుపు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.

హైదరాబాద్‌ ఒకదశలో 121/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో రాయుడు ఓర్పుతో బ్యాటింగ్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. అతను సీవీ మిలింద్‌ (36; 4 ఫోర్లు)తో కలిసి ఏడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం బెంగళూరు 45.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటై ఓడింది. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ (4/35), సిరాజ్‌ (2/38) ఆకట్టుకున్నారు. కర్ణాటక జట్టులో దేవదత్‌ పడిక్కల్‌ (60; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top