ఇంగ్లిష్ స్పిన్నర్లకు వెటోరి పాఠాలు! | Vettori to mentor English spinners | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్ స్పిన్నర్లకు వెటోరి పాఠాలు!

Oct 12 2015 4:33 PM | Updated on Sep 3 2017 10:51 AM

ఇంగ్లిష్ స్పిన్నర్లకు వెటోరి పాఠాలు!

ఇంగ్లిష్ స్పిన్నర్లకు వెటోరి పాఠాలు!

పాకిస్థాన్ తో క్రికెట్ సిరీస్ లో భాగంగా యూఏఈలో పర్యటిస్తున్నఇంగ్లండ్ టీమ్ కు మెంటర్ గా న్యూజిలాండ్ మాజీ బౌలర్ డానియల్ వెటోరి వ్యవహరించనున్నాడు.

అబు దాబి: పాకిస్థాన్ తో క్రికెట్ సిరీస్ లో భాగంగా యూఏఈలో పర్యటిస్తున్నఇంగ్లండ్ టీమ్ కు మెంటర్ గా న్యూజిలాండ్ మాజీ బౌలర్ డానియల్ వెటోరి వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఒప్పందం చేసుకున్న వెటోరి తమ జట్టుతో త్వరలో కలవనున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. దీనిలో భాగంగా మొయిన్ అలీ, అదిల్ రషీద్, సమిత్ పటేల్ తదితర బౌలర్లకు వెటోరి మెళుకవులు నేర్పనున్నట్లు ఈసీబీ స్పష్టం చేసింది.

 

కాగా, వన్డే సిరీస్ ప్రారంంభానికి ఒక రోజు ముందుగా అంటే నవంబర్ 10వ తేదీ నుంచి ఇంగ్లండ్ ఫెర్మామెన్స్ ప్రొగ్రామ్ లో వెటోరి పాల్గొనబోతున్నట్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ లో 700 పైగా వికెట్లు తీసిన వెటోరి సేవలు తమకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు ఇంగ్లిష్ బోర్డు పేర్కొంది. ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ స్పిన్నర్లలో వెటోరి కూడా ఒకడని ఈసీబీ కొనియాడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో వెటోరీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చీఫ్ కోచ్ గా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement