'నాపై నమ్మకం ఉంచినందుకు థాంక్స్‌' | Venkatesh Prasad thanks Kings XI for showing confidence in him | Sakshi
Sakshi News home page

'నాపై నమ్మకం ఉంచినందుకు థాంక్స్‌'

Mar 5 2018 12:40 PM | Updated on Mar 5 2018 12:40 PM

Venkatesh Prasad thanks Kings XI for showing confidence in him - Sakshi

న్యూఢిల్లీ: రాబోవు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో కింగ్స్‌ పంజాబ్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా ఎంపికైనందుకు టీమిండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన కారణంగానే కింగ్స్‌ పంజాబ్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసిందన్నాడు. ఆదివారం కింగ్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఎంపికైన తర్వాత మాట్లాడిన వెంకటేశ్‌ ప్రసాద్‌.. తన బాధ్యతల్ని సమర్ధవంతంగా నిర‍్వర్తించడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. కింగ్స్‌ పంజాబ్‌ జట్టుతో భాగం కావడం మధురమైన అనుభూతిగా పేర్కొన్నాడు. తన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచినందుకు కింగ్స్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాడు.

కొన్నిరోజుల కిందట భారత జూనియర్‌ క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీకి చైర్మన్‌ పదవికి వెంకటేశ్‌ ప్రసాద్‌ వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. పరస్పర విరుద్ధ ప్రయోజనాల్లో భాగంగా ముందుగా సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన వెంకటేశ్‌ ప్రసాద్‌.. కింగ్స్‌ పంజాబ్‌ బౌలింగ్‌ కోచ్‌ బాధ్యతల్ని స్వీకరించాడు.

Advertisement
 
Advertisement
Advertisement