భారత జట్టులో వరుణ్, దీక్షిత | varun and deekshita in indian team of weight lifting | Sakshi
Sakshi News home page

భారత జట్టులో వరుణ్, దీక్షిత

Jun 24 2017 11:04 AM | Updated on Sep 5 2017 2:22 PM

భారత జట్టులో వరుణ్, దీక్షిత

భారత జట్టులో వరుణ్, దీక్షిత

రాష్ట్రానికి చెందిన యువ వెయిట్‌లిఫ్టర్లు వరుణ్, దీక్షితలు ఆసియా జూనియర్, యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికయ్యారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన యువ వెయిట్‌లిఫ్టర్లు వరుణ్, దీక్షితలు ఆసియా జూనియర్, యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికయ్యారు. నేపాల్‌లోని ఖాట్మండులో జూలై 21 నుంచి 29 వరకు ఈ పోటీలు జరుగుతాయి. వరుణ్‌ 77 కేజీల విభాగంలో, దీక్షిత 58 కేజీల విభాగంలో పోటీపడతారు. ఈ సందర్భంగా ‘శాట్స్‌’ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి వీరిని అభినందించారు.

 

మన రాష్ట్రం నుంచి ఇద్దరు వెయిట్‌ లిఫ్టర్లు ఒకేసారి దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వరుణ్, దీక్షితలా మరింత మంది క్రీడాకారులు దేశం తరఫున పాల్గొని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement