ఎన్పీడీసీఎల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
అమలు తీరుపై డిస్కమ్ సీఎండీ వరుణ్‌రెడ్డి నివేదిక
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరా యాలను తక్షణమే నివారించేందుకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానా న్ని అందుబాటులోకి తెచ్చింది. రియల్ టైం మానిట రింగ్ సిస్టమ్‌ను క్షేత్ర స్థాయి వరకూ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వ్యవస్థపై ఎన్పీడీసీ ఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి విద్యుత్ ఉన్నతాధి కారులకు శుక్రవారం పూర్తి వివరాలతో కూడిన నివేది క అందించారు. ప్రతీ ఫీడర్‌ను సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా)తో అనుసంధానం చేస్తారు.
దీనిద్వారా నిరంతరం విద్యుత్ ఫీడర్ల పనితీరును అధికారులు పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ఈ వ్యవస్థను కరీంనగర్ సర్కిల్ పరిధిలోని వంద శాతం సబ్ స్టేషన్లలో పూర్తి చేశారు. మొత్తం డిస్కమ్ పరిధి లోని ఇతర జిల్లాల్లో 1,005 సబ్ స్టేషన్ల పరిధిలో అను సంధానం పూర్తయిందని వరుణ్‌రెడ్డి తెలిపారు. అతి త్వరలోనే హనుమకొండ, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్‌లో వందశాతం స్కాడ్ అనుసంధాన ప్రక్రి య పూర్తవుతుందని తెలిపారు. రాబోయే రెండు నెల ల్లో మిగతా 419 సబ్ స్టేషన్లు పూర్తి చేస్తామన్నారు.
ఇవీ ప్రయోజనాలు..
⇒ స్కాడాతో కంట్రోల్ రూమ్ నుంచే విద్యుత్ సరఫరా పరిస్థితిని రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
⇒ ఫీడర్‌లో విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే రియల్‌టైమ్ అలర్ట్‌లు అందుబాటులోకి వస్తాయి.. ∙ఫీడర్లపై ఓవర్‌లోడ్ ఏర్పడినప్పుడు తక్షణ హెచ్చరికలు వస్తాయి.
⇒ విద్యుత్ వినియోగం, వోల్టేజ్ స్థాయిలు, లోడ్ తదితర వివరాలను రియల్‌టైమ్‌లో సేకరించి విశ్లేషించే అవకాశం ఉంటుంది.
⇒ విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం సులభం అవుతుంది.
⇒ క్షేత్రస్థాయి సిబ్బంది స్పందన వేగాన్ని పెంచి, విద్యుత్ అంతరాయ సమయాన్ని తగ్గించే వీలుంటుంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలను సైతం వేగవంతం చేయవచ్చు.


