బోల్ట్ మెరుపులు | Usain Bolt wins 100m at London 2012 Anniversary Games | Sakshi
Sakshi News home page

బోల్ట్ మెరుపులు

Jul 26 2015 12:59 AM | Updated on Sep 3 2017 6:09 AM

బోల్ట్ మెరుపులు

బోల్ట్ మెరుపులు

వంద మీటర్ల పరుగులో తనకు ఎదురులేదని జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ మరోసారి నిరూపించుకున్నాడు. లండన్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్‌లో ఒలింపిక్

లండన్: వంద మీటర్ల పరుగులో తనకు ఎదురులేదని జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ మరోసారి నిరూపించుకున్నాడు. లండన్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్‌లో ఒలింపిక్ చాంపియన్ బోల్ట్ 100 మీటర్ల రేసును 9.87 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు తన ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించాడు. ఈ ఏడాది తాను పాల్గొన్న రెండో రేసులోనే బోల్ట్ ఫామ్‌లోకి వచ్చాడు. ఆరు వారాల క్రితం బ్రెజిల్‌లో జరిగిన మీట్‌లో బోల్ట్ 10.12 సెకన్ల సమయాన్ని నమోదు చేశాడు. ‘నా ఆరంభం ఇంకా మెరుగవ్వాలి. వచ్చే నెలలో బీజింగ్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 100 మీటర్ల విభాగంలో నేనే నంబర్‌వన్. నెంబర్-2గా నేనెప్పుడూ లేను. రిటైరయ్యే వరకు నేనే నంబర్‌వన్‌గా ఉండాలన్నదే నా లక్ష్యం’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement