బోల్ట్‌కు గాయం | Usain Bolt: Olympic champion hopeful for Rio despite hamstring tear | Sakshi
Sakshi News home page

బోల్ట్‌కు గాయం

Jul 3 2016 2:13 AM | Updated on Sep 4 2017 3:59 AM

బోల్ట్‌కు గాయం

బోల్ట్‌కు గాయం

జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్‌కు ముందు గాయపడ్డాడు. జమైకా నేషనల్ ఒలింపిక్ ట్రయల్స్‌లో

ఒలింపిక్స్‌కు ముందే కోలుకునే అవకాశం
 కింగ్‌స్టన్:  జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్‌కు ముందు గాయపడ్డాడు. జమైకా నేషనల్ ఒలింపిక్ ట్రయల్స్‌లో శుక్రవారం జరిగిన 100మీ. సెమీఫైనల్ హీట్‌ను 10.04 సెకన్లలో ముగించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ రేసు అనంతరం బోల్ట్ మోకాలు పైభాగంలో అసౌకర్యానికి గుర య్యాడు. ప్రస్తుతం బోల్ట్ తొడ కండరం నొప్పిని గ్రేడ్-1గా వైద్యులు నిర్ధారించారు. అయితే  బోల్ట్ రియో ఆశలకు ఎలాంటి ప్రమాదం లేదు. మరో మూడు వారాల్లో లండన్‌లో జరగనున్న డైమండ్ లీగ్  ద్వారా బోల్ట్ రియో బెర్తు దక్కించుకోవచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement