బోల్ట్‌... ఓ ప్రేక్షకుడిగా!  | Usain Bolt to attend Commonwealth Games | Sakshi
Sakshi News home page

బోల్ట్‌... ఓ ప్రేక్షకుడిగా! 

Mar 20 2018 12:41 AM | Updated on Mar 20 2018 12:41 AM

Usain Bolt to attend Commonwealth Games  - Sakshi

సిడ్నీ: స్ప్రింట్‌ దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌కు విచ్చేయనున్నాడు. అయితే పోటీదారుడిగా కాదు.... సగటు ప్రేక్షకుడిగా! వచ్చే నెల ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో 100 మీటర్ల పరుగు ఫైనల్‌ పోటీని బోల్ట్‌ తిలకిస్తాడని అతని సహచరుడు యోహాన్‌ బ్లేక్‌ వెల్లడించాడు.

‘8 సార్లు ఒలింపిక్‌ చాంపియన్, ప్రపంచ 100, 200 మీటర్ల పరుగులో రికార్డు నెలకొల్పిన బోల్ట్‌ గోల్డ్‌కోస్ట్‌కు వస్తున్నాడు. 100 మీ. పరుగు ఫైనల్స్‌ను తిలకిస్తాడు’ అని చెప్పాడు. తాను వచ్చాక జమైకన్లు పతకం గెలవకపోతే బాగుండదని బోల్ట్‌ అన్నట్లు బ్లేక్‌ తెలిపాడు.  

Advertisement
 
Advertisement
Advertisement