యూపీ విజార్డ్స్‌ గెలుపు | UP Wizards win | Sakshi
Sakshi News home page

యూపీ విజార్డ్స్‌ గెలుపు

Feb 14 2017 12:53 AM | Updated on Sep 5 2017 3:37 AM

హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో ఉత్తరప్రదేశ్‌ (యూపీ) విజార్డ్స్‌ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది.

చండీగఢ్‌: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో ఉత్తరప్రదేశ్‌ (యూపీ) విజార్డ్స్‌ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం పంజాబ్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్‌ 6–2తో గెలిచింది.

యూపీ తరఫున షంషేర్‌ సింగ్‌ (5వ ని.లో), అజయ్‌ యాదవ్‌ (40వ ని.లో), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (58వ ని.లో) ఒక్కో ఫీల్డ్‌ గోల్‌ (రెండు గోల్స్‌తో సమానం) చేశారు. పంజాబ్‌ జట్టుకు మిర్కో ప్రుసెర్‌ (31వ ని.లో) ఏకైక ఫీల్డ్‌ గోల్‌ అందించాడు.   

 

Advertisement
 
Advertisement
Advertisement