breaking news
Shamsher Singh
-
ఎస్బీఐ ఫండ్స్ ఎండీగా షంషేర్ సింగ్ నియామకం
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న షంషేర్ సింగ్ తాజాగా ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు కొత్త ఎండీ, సీఈవోగా ఎంపికయ్యారు. ప్రస్తుత ఎండీ, సీఈవో వినయ్ ఎం టాన్సే నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. వినయ్ ఎస్బీఐకు తిరిగి బదిలీకానున్నట్లు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఎస్బీఐలోని వివిధ విభాగాలలో 32ఏళ్లకుపైగా పనిచేసిన అనుభవం సింగ్ సొంతంకాగా.. ఇన్వెస్ట్మెంట్, కార్పొరేట్, బ్రాంచ్ బ్యాంకింగ్లతోపాటు, ట్రెజరీ తదిరాలలో విధులు నిర్వర్తించారు. 1990 జూన్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా సింగ్ తొలుత ఎస్బీఐలో చేరారు. తదుపరి వివిధ నాయకత్వ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ డిప్యూటీ ఎండీగా పదవోన్నతి పొందారు. ఈ క్రమంలో యూఎస్, బహ్రయిన్, యూఏఈలలోనూ విధులు నిర్వహించారు. -
యూపీ విజార్డ్స్ గెలుపు
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ఉత్తరప్రదేశ్ (యూపీ) విజార్డ్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం పంజాబ్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్ 6–2తో గెలిచింది. యూపీ తరఫున షంషేర్ సింగ్ (5వ ని.లో), అజయ్ యాదవ్ (40వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్ (58వ ని.లో) ఒక్కో ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) చేశారు. పంజాబ్ జట్టుకు మిర్కో ప్రుసెర్ (31వ ని.లో) ఏకైక ఫీల్డ్ గోల్ అందించాడు.