కశ్యప్, గురుసాయిదత్‌లకు చెరో రూ.55 లక్షలు | TS financial aid to Kashyap, Gurusaidutt | Sakshi
Sakshi News home page

కశ్యప్, గురుసాయిదత్‌లకు చెరో రూ.55 లక్షలు

May 26 2019 9:56 AM | Updated on May 26 2019 9:56 AM

TS financial aid to Kashyap, Gurusaidutt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు పారుపల్లి కశ్యప్, ఆర్‌ఎంవీ గురుసాయిదత్‌లకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇద్దరికీ చెరో 55 లక్షల చొప్పున మొత్తం రూ. కోటీ 10 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శాట్స్‌ ఎండీ ఎ. దినకర్‌బాబు శనివారం తన కార్యాలయంలో కశ్యప్, గురుసాయిదత్‌లకు అందించారు. వీరిద్దరూ భవిష్యత్‌లో గొప్పగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు.

గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో వెనుకబడిన కశ్యప్, గురుసాయిదత్‌లకు మెరుగైన ట్రెయినర్లు, ఫిజియో థెరపిస్టులు, శిక్షణ కోసం ఈ సహాయాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ టోర్నీల్లో రాణించేందుకు, వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ప్రోత్సాహకంగా పనిచేస్తుందని వివరించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement