ఇంగ్లండ్‌ కోచ్‌కు సన్‌రైజర్స్‌ బంపర్‌ ఆఫర్‌ | Trevor Bayliss Appointed As Sunrisers Hyderabad Head Coach | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌కు ఇంగ్లండ్‌ కోచ్‌

Jul 18 2019 5:41 PM | Updated on Jul 18 2019 5:57 PM

Trevor Bayliss Appointed As Sunrisers Hyderabad Head Coach - Sakshi

ఇం‍గ్లండ్‌ ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ట్రెవర్‌ బేలిస్‌ సన్‌రైజర్స్‌ కోచ్‌గా నియమితులయ్యారు..

హైదరాబాద్‌: ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్న ట్రెవర్‌ బేలిస్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్విటర్‌ వేదికగా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఏడు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌కు సేవలందించిన టామ్‌ మూడీకి ధన్యవాదాలు తెలిపింది. ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా నిలవడంతో ప్రధాన కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ క్రేజ్‌ అమాంతం పెరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్‌ బేలిస్‌ శిక్షణలో ఇంగ్లండ్‌ తొలిసారి ప్రపంచకప్‌ విజేతగా నిలవడంతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీపడ్డాయి. కోల్‌కతా నైట్‌​రైడర్స్‌ కూడా బేలిస్‌ కోసం చివరి వరకు ప్రయత్నించింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో తమ జట్టుకు కోచ్‌గా సేవలందించేందుకు బేలిస్‌కు సన్‌రైజర్స్‌ భారీ మొత్తంలో ఆఫర్‌ చేసినట్లు తెలిసింది.

ఇక కోచ్‌గా బేలిస్‌కు మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. ఐపీఎల్‌లో రెండు సార్లు విజేతగా నిలిచినప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కోచ్‌గా బేలిస్‌ ఉన్నాడు. అంతేకాకుండా సిడ్నీ సిక్సర్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ గెలవడంలో కోచ్‌గా బేలిస్‌ పాత్ర మరవలేనిది. తాజాగా ఇంగ్లండ్‌ తొలిసారి ప్రపంచకప్‌ గెలవడంతో అందరి దృష్టి ఇతడిపై పడింది. ముఖ్యంగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు బేలిస్‌ కోసం పోటీపడ్డాయి. ఇక సన్‌రైజర్స్‌ కోచ్‌గా టామ్‌ మూడీకి ఘనమైన రికార్డే ఉంది. మూడీ కోచింగ్‌లోనే సన్‌రైజర్స్‌ 2016లో ఐపీఎల్‌ ట్రోఫీ గెలవడంతో పాటు, ఐదు సార్లు ప్లే ఆఫ్‌కు చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement