మరో గెలుపుపై గురి  | Today is the second T20 of women | Sakshi
Sakshi News home page

మరో గెలుపుపై గురి 

Feb 16 2018 1:12 AM | Updated on Feb 16 2018 1:12 AM

Today is the second T20 of women - Sakshi

మిథాలీ రాజ్, వేద కృష్ణమూర్తి

ఈస్ట్‌ లండన్‌: దక్షిణాఫ్రికాతో తొలి టి20లో రికార్డు ఛేదనతో అదరగొట్టిన భారత మహిళల జట్టు శుక్రవారం ఇక్కడ రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. మిథాలీ రాజ్, వేద కృష్ణమూర్తిలతో పాటు కొత్తమ్మాయి జెమీమా రోడ్రిగ్స్‌ కూడా రాణించడంతో మొదటి మ్యాచ్‌లో మన జట్టు ఏడు వికెట్లతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో భారత్‌ ముందంజ వేస్తుంది.

బ్యాటింగ్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, ఓపెనర్‌ స్మృతి మంధాన కూడా సత్తా చాటితే భారత్‌కు తిరుగుండదు. ఆఫ్‌ స్పిన్నర్‌ అనూజ పాటిల్‌ గత మ్యాచ్‌లో పొదుపైన బౌలింగ్‌తో రెండు వికెట్లు పడగొట్టింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా ఎక్కువగా కెప్టెన్‌ నికెర్క్‌ పైనే ఆధారపడుతోంది. ఫీల్డింగ్, బౌలింగ్‌లో మెరుగైతే తప్ప భారత్‌ను ఓడించలేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకే ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement