వన్డే నాకౌట్ విజేత ఆంధ్రా బ్యాంక్ | The winner of the knockout one-day is Andhra Bank | Sakshi
Sakshi News home page

వన్డే నాకౌట్ విజేత ఆంధ్రా బ్యాంక్

Oct 21 2014 1:04 AM | Updated on Sep 2 2017 3:10 PM

వన్డే నాకౌట్ విజేత ఆంధ్రా బ్యాంక్

వన్డే నాకౌట్ విజేత ఆంధ్రా బ్యాంక్

సాక్షి, హైదరాబాద్: కిషన్ పర్షాద్ ‘ఎ' డివిజన్ (మూడు రోజుల జట్ల) వన్డే నాకౌట్ టోర్నమెంట్‌లో ఆంధ్రా బ్యాంక్ జట్టు విజేతగా నిలిచింది.

సెంచరీతో చెలరేగిన రవితేజ

 సాక్షి, హైదరాబాద్: కిషన్ పర్షాద్ ‘ఎ' డివిజన్ (మూడు రోజుల జట్ల) వన్డే నాకౌట్ టోర్నమెంట్‌లో ఆంధ్రా బ్యాంక్ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం హకీంపేట్ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్లో ఆంధ్రా బ్యాంక్ 4 పరుగుల తేడాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్)పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా బ్యాంక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.

ద్వారకా రవితేజ (112) సెంచరీ చెలరేగాడు. రొనాల్డ్ రోడ్రిగ్జ్ (59), అభినవ్ కుమార్ (53)లతో పాటు నీరజ్ బిస్త్ (43) రాణించాడు. ఎస్‌బీహెచ్ బౌలర్లలో ఆల్ఫ్రెడ్ అబ్సలం, రవికిరణ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఎస్‌బీహెచ్ 49.3 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. డానీ డెరెక్ ప్రిన్స్ (145) భారీ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. అశ్విన్ యాదవ్ (47), అహ్మద్ ఖాద్రీ (30) ఫర్వాలేదనిపించారు. ఆంధ్రా బ్యాంక్ బౌలర్లలో రవితేజ, ఖాదర్, లలిత్ మోహన్, ఆశిష్ రెడ్డి తలా 2 వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement