ఆరో ర్యాంక్‌లోనే పుజారా | The sixth rank pujara | Sakshi
Sakshi News home page

ఆరో ర్యాంక్‌లోనే పుజారా

Aug 7 2013 2:49 AM | Updated on Sep 1 2017 9:41 PM

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో... భారత ఓపెనర్ చతేశ్వర్ పుజారా (777 ర్యాంకింగ్ పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-20లో పుజారా మినహా భారత బాట్స్‌మెన్ ఎవ్వరికీ చోటు దక్కలేదు.

 దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో... భారత ఓపెనర్ చతేశ్వర్ పుజారా (777 ర్యాంకింగ్ పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-20లో పుజారా మినహా భారత బాట్స్‌మెన్ ఎవ్వరికీ చోటు దక్కలేదు.
 
  హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా-903) అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 8వ ర్యాంక్‌లో నిలిచాడు. హైదరాబాద్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా 10వ స్థానంలో ఉండగా... జహీర్ ఖాన్ 17వ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement