వచ్చే నెలలో జరగాల్సిన జింబాబ్వే పర్యటన అధికారికంగా ఇంకా ఖరారు కాకపోయినా... ఈనెల 29న భారత జట్టును
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఎంపిక 29న
ముంబై : వచ్చే నెలలో జరగాల్సిన జింబాబ్వే పర్యటన అధికారికంగా ఇంకా ఖరారు కాకపోయినా... ఈనెల 29న భారత జట్టును మాత్రం ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. సీనియర్ క్రికెటర్లు కొంతమంది ఈ పర్యటనకు దూరం కానున్నారనే వార్తల నేపథ్యంలో... విశ్రాంతి కావాలని తమకెవరూ ఇప్పటివరకూ చెప్పలేదని సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ చెప్పారు. ఎవరైనా ఆటగాడు అందుబాటులో లేకపోతే బోర్డు కార్యదర్శి ఠాకూర్‌కు తెలియజేస్తారని ఆయన తెలిపారు.
ఏడాది కాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నందున కొందరు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి ద్వితీయ శ్రేణి జట్టును పంపిస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. జింబాబ్వే పర్యటన గురించి బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. అయితే రెండు బోర్డుల వెబ్‌సైట్‌లలో ఈ సిరీస్ షెడ్యూల్ ఉంది. వచ్చే నెల 10, 12, 14 తేదీల్లో 3 వన్డేలు, 17, 19ల్లో రెండు టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి.