మెయిన్ డ్రాకు అశ్విని-మను జంట | The main draw of a couple of Ashwini Manu | Sakshi
Sakshi News home page

మెయిన్ డ్రాకు అశ్విని-మను జంట

May 31 2016 12:35 AM | Updated on Sep 4 2017 1:16 AM

క్వాలిఫయింగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన అశ్విని పొన్నప్ప-మనూ అత్రి (భారత్) జోడీ ఇండోనేసియా సూపర్ సిరీస్......

ఇండోనేసియా సూపర్ సిరీస్ టోర్నీ

జకర్తా: క్వాలిఫయింగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన అశ్విని పొన్నప్ప-మనూ అత్రి (భారత్) జోడీ ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రధాన డ్రాకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో మనూ-అశ్విని 21-18, 21-13తో స్థానిక జంట హెండ్రా తండ్జయా-మోనిక ఇంతన్ టుటిహర్తపై; రెండో మ్యాచ్‌లో 19-21, 21-10, 21-11తో దిదితి యువాంగ్-కేశ్య నుర్రిత (ఇండోనేసియా)పై గెలిచారు.

మంగళవారం జరిగే ప్రధాన టోర్నీలో మను-అశ్విని... యాంగ్ కాయ్ టెర్రీ హీ-వీ హన్ టాన్ (సింగపూర్)తో తలపడతారు. మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్... చైనీస్ తైపీకి చెందిన పాయ్ యు పోతో ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement