మరో 36 పరుగులు చేస్తే... | The first test from today sri lank | Sakshi
Sakshi News home page

మరో 36 పరుగులు చేస్తే...

May 19 2016 1:50 AM | Updated on Sep 4 2017 12:23 AM

మరో 36 పరుగులు చేస్తే...

మరో 36 పరుగులు చేస్తే...

మరో 36 పరుగులు చేస్తే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్... టెస్టుల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు.

అరుదైన రికార్డు కుక్ సొంతం 
నేటి నుంచి లంకతో తొలి టెస్టు
 

లీడ్స్: మరో 36 పరుగులు చేస్తే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్... టెస్టుల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కుతాడు. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా సచిన్ రికార్డునూ అధిగమిస్తాడు. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్... శ్రీలంకతో తలపడుతుంది.  గతంలో సచిన్ 31 ఏళ్ల 10 నెలల వయసులో పాకిస్తాన్ (2005)పై ఈ రికార్డును సాధించాడు. గతేడాది క్రిస్‌మస్‌తో కుక్‌కు 31 ఏళ్లు నిండాయి.

 
 

Advertisement
 
Advertisement
Advertisement