క్వార్టర్‌ ఫైనల్లో విశ్వనాథ్, సచిన్‌ | Vishvanath Suresh, Sachin sail into quarter-finals Asian Boxing Championships 2026 | Sakshi
Sakshi News home page

Asian Boxing Championship 2026: క్వార్టర్‌ ఫైనల్లో విశ్వనాథ్, సచిన్‌

Apr 2 2026 9:24 AM | Updated on Apr 2 2026 9:41 AM

Vishvanath Suresh, Sachin sail into quarter-finals Asian Boxing Championships 2026

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు బరిలోకి దిగిన ఇద్దరు భారత బాక్సర్లు ఏకపక్ష విజయాలు నమోదు చేశారు. పురుషుల 50 కేజీల విభాగంలో విశ్వనాథ్‌ సురేశ్‌... 60 కేజీల విభాగంలో సచిన్‌ సివాచ్‌ తొలి రౌండ్‌లో గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

విశ్వనాథ్‌ 5:0తో బెక్‌జాత్‌ ఎర్గెషోవ్‌ (కిర్గిస్తాన్‌)పై గెలుపొందగా... సచిన్‌ 4:1తో బుయన్‌దలై బయార్‌ఖు (మంగోలియా)ను ఓడించాడు. క్వార్టర్‌ ఫైనల్లో చెంగ్‌ వె లీ (చైనీస్‌ తైపీ)తో సచిన్‌... సన్‌జార్‌ తష్కెన్‌బే (కజకిస్తాన్‌)తో విశ్వనాథ్‌ తలపడతారు.    

Advertisement
 
Advertisement
Advertisement