సంచలన విజయంతో సెమీస్‌లోకి బోపన్న జంట | The boofly couple into the semifinal with sensational success | Sakshi
Sakshi News home page

సంచలన విజయంతో సెమీస్‌లోకి బోపన్న జంట

Apr 22 2017 1:16 AM | Updated on Sep 5 2017 9:20 AM

సంచలన విజయంతో సెమీస్‌లోకి బోపన్న జంట

సంచలన విజయంతో సెమీస్‌లోకి బోపన్న జంట

డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జంట హెన్రీ కొంటినెన్‌ (ఫిన్‌లాండ్‌)–జాన్‌ పీర్స్‌ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం

మోంటెకార్లో (మొనాకో): డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జంట హెన్రీ కొంటినెన్‌ (ఫిన్‌లాండ్‌)–జాన్‌ పీర్స్‌ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం సాధించి... మోంటెకార్లో మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–క్యువాస్‌ జోడీ 3–6, 6–3, 13–11తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో కొంటినెన్‌–జాన్‌ పీర్స్‌ జంటను బోల్తా కొట్టించింది.

శనివారం జరిగే సెమీఫైనల్లో అర్‌నియోడో (మొనాకో)–హుగో నిస్‌ (ఫ్రాన్స్‌)లతో బోపన్న–క్యువాస్‌ ఆడతారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం) 2–6, 6–3, 7–5తో రెండో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా)ను ఓడించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement