టెన్నికాయిట్ విజేత అనిల్ | tennikoit winner Anil | Sakshi
Sakshi News home page

టెన్నికాయిట్ విజేత అనిల్

Jan 24 2014 12:05 AM | Updated on Sep 2 2017 2:55 AM

ఎల్.వెంకట్రామిరెడ్డి స్మారక టెన్నికాయిట్ టోర్నీలో హైదరాబాద్ కుర్రాడు అనిల్ విజేతగా నిలిచాడు.

 జింఖానా, న్యూస్‌లైన్: ఎల్.వెంకట్రామిరెడ్డి స్మారక టెన్నికాయిట్ టోర్నీలో హైదరాబాద్ కుర్రాడు అనిల్ విజేతగా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగం ఫైనల్లో అనిల్ 21-18, 21-19తో వరంగల్‌కు చెందిన ప్రకాష్‌పై గెలుపొందాడు.
 
 బాలికల విభాగం ఫైనల్లో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీహర్ష 14-21, 18-21తో రేవతి (ప్రకాశం) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు భారత టెన్నికాయిట్ సమాఖ్య (టీకేఎఫ్‌ఐ) ఉపాధ్యక్షడు టి. రామమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి టీకేఎఫ్‌ఐ కార్యదర్శి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement