ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు | Ten wickets in an innings | Sakshi
Sakshi News home page

ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు

Mar 3 2016 12:21 AM | Updated on Sep 3 2017 6:51 PM

ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు

ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు

హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) లీగ్‌లో శ్రీచక్ర బౌలర్ ఫాతిమా రెడ్డి ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి ....

 హెచ్‌సీఏ లీగ్‌లో ఫాతిమా రెడ్డి సంచలనం

 సాక్షి, కుత్బుల్లాపూర్:  హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) లీగ్‌లో శ్రీచక్ర బౌలర్ ఫాతిమా రెడ్డి ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా శ్రీచక్ర జట్టు లెఫ్టార్మ్ స్పిన్నర్ ఫాతిమా రెడ్డి (21.4-3-55-10) ధాటికి ప్రత్యర్థి జట్టు బాలాజీ కోల్ట్స్ 128 పరుగులకే కుప్పకూలింది. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీచక్ర జట్టు 56 ఓవర్లలో ఏడు వికెట్లకు 204 పరుగులు చేసింది. రఘు (101) సెంచరీ చేశాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement