టైటాన్స్‌ మూడో విజయం | Telugu Titans continue resurgence with win over Jaipur Pink Panthers | Sakshi
Sakshi News home page

టైటాన్స్‌ మూడో విజయం

Aug 25 2019 4:58 AM | Updated on Aug 25 2019 4:58 AM

Telugu Titans continue resurgence with win over Jaipur Pink Panthers - Sakshi

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ మూడో విజయాన్ని సాధించింది. ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 24–21తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌కు షాకిచ్చింది. డిఫెండర్‌ విశాల్‌ భరద్వాజ్‌ 8 టాకిల్‌ పాయింట్లతో ప్రత్యర్థిని పట్టేయడంలో సఫలం అయ్యాడు. చివర్లో టైటాన్స్‌ సారథి అబొజర్‌ తన అనుభవంతో ప్రత్యర్థిని పట్టేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో ఆతిథ్య ఢిల్లీ దబంగ్‌ 33–31తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్‌; యూపీ యోధతో దబంగ్‌ ఢిల్లీ తలపడతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement