నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ బోణీ | NorthEast United edge out Delhi Dynamos | Sakshi
Sakshi News home page

నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ బోణీ

Nov 22 2020 6:30 AM | Updated on Nov 22 2020 6:30 AM

NorthEast United edge out Delhi Dynamos - Sakshi

వాస్కోడగామా (గోవా): ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ఏడో సీజన్‌లో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) బోణీ కొట్టింది. ఇక్కడి తిలక్‌ మైదాన్‌ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ 1–0తో ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌పై గెలుపొందింది. జట్టుకు లభించిన పెనాల్టీని 49వ నిమిషంలో గోల్‌గా మలిచిన అపియా నార్త్‌ఈస్ట్‌కు విజయం దక్కేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముంబై... ఆ అంచనాలకు తగ్గట్టే మ్యాచ్‌ను ఆరంభించింది. ముఖ్యంగా అహ్మద్‌ జాహూ, హ్యూగో బౌమస్, ఒగ్బెచే చక్కటి సమన్వయంతో కదులుతూ నార్త్‌ఈస్ట్‌పై ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌ దగ్గరికి బంతిని తీసుకెళ్లినా... ఫినిష్‌ చేయడంలో సఫలం కాలేకపోయారు. నేటి మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీతో బెంగళూరు ఎఫ్‌సీ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement