తెలంగాణ జట్టుకు మూడోస్థానం | Telangana Team Got Third Place in Softball Championship | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్టుకు మూడోస్థానం

May 28 2019 10:07 AM | Updated on May 28 2019 10:07 AM

Telangana Team Got Third Place in Softball Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు రాణించింది. ఆర్మూర్‌లోని ఈఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీ బాలికల విభా గంలో తెలంగాణ జట్టు మూడోస్థానాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన బాలికల ఫైనల్లో మహారాష్ట్ర జట్టు 8–7తో ఆంధ్రప్రదేశ్‌పై గెలు పొంది విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ 4–0తో ఛత్తీస్‌గఢ్‌ను చిత్తుగా ఓడించింది. పంజాబ్‌ జట్టుకు మూడోస్థానం లభించింది.

పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌ ఎన్‌వీ సాంబయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత సాఫ్ట్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఎల్‌ఆర్‌ మౌర్య, సీఈవో ప్రవీణ్‌ అనోకర్, కోశాధికారి శ్రీకాంత్, నిజామాబాద్‌ జిల్లా సాఫ్ట్‌బాల్‌ సంఘం చైర్మన్‌ లింగారెడ్డి, కార్యదర్శి కె. శోభన్‌బాబు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement