టైటిల్‌పోరుకు తెలంగాణ జట్లు | Telangana Softball Teams to Fight in Summit Clash | Sakshi
Sakshi News home page

టైటిల్‌పోరుకు తెలంగాణ జట్లు

Apr 9 2019 3:25 PM | Updated on Apr 9 2019 3:25 PM

Telangana Softball Teams to Fight in Summit Clash - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మినీ సబ్‌ జూనియర్‌ అండర్‌–12 జాతీయ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు జోరు కనబరుస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ జట్లు టైటిల్‌పోరుకు అర్హత సాధించాయి. సోమవారం జరిగిన బాలికల సెమీస్‌ మ్యాచ్‌ల్లో తెలంగాణ 10–0తో ఆంధ్రప్రదేశ్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో తెలంగాణ 3–0తో హరియాణాపై, రాజస్తాన్‌ 6–3తో మహారాష్ట్రపై, ఆంధ్రప్రదేశ్‌ 10–0తో హిమాచల్‌ప్రదేశ్‌పై గెలుపొందాయి. మరోవైపు బాలుర సెమీఫైనల్లో తెలంగాణ 15–0తో పంజాబ్‌ను ఓడించింది. మరో సెమీస్‌లో ఆంధ్రప్రదేశ్‌ 11–1తో మధ్యప్రదేశ్‌పై గెలుపొంది తెలంగాణతో టైటిల్‌పోరుకు సిద్ధమైంది. బాలుర క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో తెలంగాణ 10–0తో హిమాచల్‌ప్రదేశ్‌పై, మధ్యప్రదేశ్‌ 10–0తో హరియాణాపై, పంజాబ్‌ 6–4తో రాజస్తాన్‌పై, ఆంధ్రప్రదేశ్‌ 10–0తో మహారాష్ట్రపై విజయం సాధించాయి.

Advertisement
 
Advertisement
Advertisement