తెలంగాణకు మిశ్రమ ఫలితాలు | telangana got mixed results in softball championship | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మిశ్రమ ఫలితాలు

Sep 28 2017 10:43 AM | Updated on Sep 28 2017 10:43 AM

telangana got mixed results in softball championship

బ్యాటింగ్ చేస్తోన్న ప్రియాంక

జాతీయ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. దోమల్‌గూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్య కాలేజీలో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ బాలికల జట్టు సెమీస్‌కు చేరుకోగా, బాలుర జట్టు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. బుధవారం జరిగిన బాలికల క్వార్టర్స్‌ మ్యాచ్‌లో తెలంగాణ 8–0తో హరియాణాను చిత్తుగా ఓడించి ముందంజ వేసింది.

ఇతర మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్‌ 2–0తో ఢిల్లీపై, రాజస్తాన్‌ 2–0తో మణిపూర్‌పై, మహారాష్ట్ర 5–0తో మధ్యప్రదేశ్‌పై, ఏపీ 13–0తో మణిపూర్‌పై, మహారాష్ట్ర 3–0తో మధ్యప్రదేశ్‌పై గెలుపొందాయి. బాలుర విభాగంలో తెలంగాణ జట్టు 0–1తో రాజస్తాన్‌ చేతిలో పరాజయం పాలైంది. ఇతర మ్యాచ్‌ల్లో కేరళ 2–1తో ఏపీపై, ఛత్తీస్‌గఢ్‌ 1–0తో పంజాబ్‌పై, పంజాబ్‌ 7–0తో కేరళపై విజయం సాధించాయి. నేడు జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తెలంగాణ బాలికల జట్టు రాజస్తాన్‌తో తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement