తెలంగాణ, ఏపీ జట్ల ముందంజ | Telangana, AP Lead in Softball Championship | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఏపీ జట్ల ముందంజ

May 25 2019 9:50 AM | Updated on May 25 2019 9:50 AM

Telangana, AP Lead in Softball Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ, ఏపీ బాలికల జట్లు ముందంజ వేశాయి. ఆర్మూర్‌లోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 10–0తో పాండిచ్చేరిపై ఘనవిజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఏపీ 10–0తో హెచ్‌ఏఎల్‌ను చిత్తుగా ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ 13–1తో చండీగఢ్‌పై, పంజాబ్‌ 15–5తో ఢిల్లీపై, మధ్యప్రదేశ్‌ 2–1తో హరియాణాపై, మహారాష్ట్ర 10–0తో ఉత్తరప్రదేశ్‌పై గెలిచాయి.

బాలుర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్‌ 6–5తో రాజస్తాన్‌పై, గుజరాత్‌ 12–11తో హరియాణాపై, ఛత్తీస్‌గఢ్‌ 14–0తో ఢిల్లీపై, పాండిచ్చేరి 11–0తో గుజరాత్‌పై, పంజాబ్‌ 9–0తో హెచ్‌ఏఎల్‌పై, కర్ణాటక 11–0తో మణిపూర్‌పై, మధ్యప్రదేశ్‌ 17–0తో తమిళనాడుపై, ఉత్తరప్రదేశ్‌ 10–0తో మణిపూర్‌పై విజయం సాధించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement