టి20 కబుర్లు... | T20 decisions... | Sakshi
Sakshi News home page

టి20 కబుర్లు...

Mar 26 2014 1:03 AM | Updated on Sep 2 2017 5:09 AM

రవిశంకర్ జయధ్రుత శాస్త్రి... ఈ క్రికెటర్ పేరును ఎప్పుడైనా విన్నారా! ఇలా కాకుండా సింపుల్‌గా రవిశాస్త్రి అంటే అందరికీ ఒకనాటి భారత ఆల్‌రౌండర్, ఇప్పటి స్టార్ కామెంటేటర్ అని అర్థమవుతుంది.

శంకర శాస్త్రి సంగీతం!
 రవిశంకర్ జయధ్రుత శాస్త్రి... ఈ క్రికెటర్ పేరును ఎప్పుడైనా విన్నారా! ఇలా కాకుండా సింపుల్‌గా రవిశాస్త్రి అంటే అందరికీ ఒకనాటి భారత ఆల్‌రౌండర్, ఇప్పటి స్టార్ కామెంటేటర్ అని అర్థమవుతుంది. సీరియస్ కామెంటరీ మినహా సిద్ధూ తరహాలో కాస్త హాస్యాన్ని జోడించి అతను పెద్దగా మాట్లాడింది మనకు వినిపించదు. అయితే ప్రపంచకప్ సందర్భంగా శాస్త్రి ఉంటున్న హోటల్లో ఒక ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది.
 
 బంగ్లాదేశ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తన మనవరాలితో కలిసి రవిశాస్త్రికి ‘ఇక్తారా’ అనే ఒక సంగీత వాద్య పరికరాన్ని బహుమతిగా ఇచ్చాడు. శాస్త్రి దానిని పరిశీలించే క్రమంలో తీగలను మీటి చక్కటి శబ్దం వస్తోంది అంటూ థ్యాంక్స్ చెప్పారు. దాంతో సదరు జర్నలిస్ట్ మీకు సంగీతంలో ప్రవేశం ఉందా అంటూ ప్రశ్నించాడు. దానికి రవిశాస్త్రి ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా... ‘ఖచ్చితంగా... నా పేరులోని సంగీతం ఉంది. పూర్తి పేరు రవిశంకర్ (ప్రముఖ సితార్ విద్వాంసుడిని గుర్తు చేస్తూ) అని మరచిపోతున్నారు’ అని వ్యాఖ్యానిస్తూ తనలోని హాస్య చతురతను బయట పెట్టారు!
 
 ‘గూగ్లీ’ ఆడేదెట్టా మామా!
 ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్‌తో పాక్ ఆశలు సజీవంగా నిలిపిన బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్. అయితే అతని బ్యాటింగ్ బలహీనతల్లో ఒకటి లెగ్‌స్పిన్‌ను ఎదుర్కోలేకపోవడం. దాదాపు ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్ తర్వాత కూడా అతను లెగ్ స్పిన్నర్ల ఆయుధమైన ‘గూగ్లీ’ని సరిగా ఆడలేడు. పాక్ దేశవాళీతోపాటు నెట్స్‌లో కనేరియా, జీవన్ మెండిస్, కెనడా బౌలర్ బాలాజీ రావు, తాజాగా అమిత్ మిశ్రా అతడిని బాగా ఇబ్బంది పెట్టారు.
 
 ఆసీస్ జట్టులో లెగ్‌స్పిన్నర్ లేకపోవడంతో అతను చెలరేగాడని కూడా వినిపించింది. అయితే ఇప్పుడు దానిని సరిచేసుకునేందుకు అతని కాబోయే మామనే శరణు వేడాడు. ఇంతకీ ఉమర్ మామ ఎవరో తెలుసా...విఖ్యాత లెగ్‌స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్!  టి20 ప్రపంచకప్ ముగిశాక ఖాదిర్ కూతురు నూర్ ఆమ్నాను ఉమర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆపై తన లోపాలు సరిదిద్దుకునేందుకు ఖాదిర్‌తో కలిసి ప్రాక్టీస్ చేయాలని అక్మల్ నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాతైనా అతని బ్యాటింగ్ మరింత పదును తేలుతుందో చూడాలి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement