భారత టెన్నిస్ జట్టులో సాత్విక | swathika selected tennis team for india | Sakshi
Sakshi News home page

భారత టెన్నిస్ జట్టులో సాత్విక

Apr 28 2014 1:49 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వర్ధమాన టెన్నిస్ క్రీడాకారిణి సామ సాత్విక తన కెరీర్‌లో మరో ముందడుగు వేసింది. ఆసియా ఓసియానియా వరల్డ్ జూనియర్ అండర్-14 టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో ఈ అమ్మాయికి స్థానం లభించింది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వర్ధమాన టెన్నిస్ క్రీడాకారిణి సామ సాత్విక తన కెరీర్‌లో మరో ముందడుగు వేసింది. ఆసియా ఓసియానియా వరల్డ్ జూనియర్ అండర్-14 టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో ఈ అమ్మాయికి స్థానం లభించింది. ఈ టోర్నీ సోమవారం నుంచి మే 3 వరకు జరుగుతుంది.
 
 ఈ టోర్నీలో ఆడుతున్న మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. భారత్‌తో పాటు చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనీస్ తైపీ, మలేసియా తదితర జట్లు ఇందులో పోటీపడుతున్నాయి. ఇటీవలే వియత్నాంలో జరిగిన ఆసియా టెన్నిస్ సమాఖ్య టోర్నీలో భారత జట్టు సభ్యురాలిగా ఉన్న సాత్విక, ప్రస్తుతం జాతీయ అండర్-14 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement