ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్‌స (సీఎస్‌కే)పై రెండేళ్ల నిషేధం ఎత్తివేతపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్‌స (సీఎస్‌కే)పై రెండేళ్ల నిషేధం ఎత్తివేతపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. 2013లో సీఎస్‌కే టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ స్కామ్‌లో ఇరుక్కోవడంతో ఆ జట్టుపై తాత్కాలిక నిషేధం విధించారు. అయితే సీఎస్‌కే ఆటగాళ్లపై కానీ, యజమాని శ్రీనివాసన్‌పై కానీ ఎలాంటి ఆరోపణలు రాలేదని, ఈ నిషేధాన్ని వెంటనే ఎత్తేయాలని ఆగస్టు 26న బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అత్యవసర విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. ఈనేపథ్యంలో మంగళవారం చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. అయితే జనవరి 20న ఇదే విషయమై మద్రాస్ హైకోర్టు ఈ కేసును కొట్టేసింది.