సునీల్‌కు రజతం | Sunil gets Silver Medal | Sakshi
Sakshi News home page

సునీల్‌కు రజతం

Jul 1 2018 10:12 AM | Updated on Jul 1 2018 10:12 AM

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా జూనియర్‌ రోయింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రోయర్లు టి. సునీల్, డి.సాయిరాజు మెరుగైన ప్రతిభతో ఆకట్టుకున్నారు. దక్షిణ కొరియాలోని చంగ్‌ జు నగరంలో జరిగిన ఈ టోర్నీలో రజత, కాంస్య పతకాలను సాధించారు. జూనియర్‌ కాక్స్‌లెస్‌ ఫోర్‌ విభాగంలో టి. సునీల్‌ రన్నరప్‌గా నిలవగా, పెయిర్‌ విభాగంలో డి. సాయిరాజు మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నాడు.

తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌కు చెందిన బి. హేమలత.. జూనియర్‌ డబుల్‌ స్కల్‌ విభాగంలో బరిలోకి దిగి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత్‌ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement