సారీ..! ఇమ్రాన్‌ : గావస్కర్‌

Sunil Gavaskar Will Not Attend To Imran Khan Oath Ceremony - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌ ఖాన్‌కు సునీల్‌ గావస్కర్‌ ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. ఆగస్టు 18న ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గావస్కర్‌కు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. అయితే, అదే రోజు భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌లో కామెంటరీ చేయాల్సి ఉన్నందున.. తాను ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నానని ఇమ్రాన్‌కు వెల్లడించినట్టు తెలిపారు. కాగా, గావస్కర్‌తో పాటు కపిల్‌దేవ్‌, నవజోత్‌సింగ్‌ సిద్ధూ కూడా ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు. ఇమ్రాన్‌ నాయకత్వంలో పాకిస్తాన్‌ జట్టు 1992లో వన్డే క్రికెట్‌ వరల్డ్‌కప్‌ గెలుచుకున్న సంగతి విదితమే. అప్పటి పాకిస్తాన్‌ జట్టు సభ్యులందరికీ కూడా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపినట్టు పీటీఐ అధికార ప్రతినిధి ఫైజల్‌ జావెద్‌ తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top