రాణించిన డేవిడ్ వార్నర్ | sun risers hyderabad set target of 159 runs for delhi dare devils | Sakshi
Sakshi News home page

రాణించిన డేవిడ్ వార్నర్

May 20 2016 9:49 PM | Updated on Sep 4 2017 12:32 AM

రాణించిన డేవిడ్ వార్నర్

రాణించిన డేవిడ్ వార్నర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

రాయ్ పూర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్(73;56 బంతుల్లో 8 ఫోర్లు,1 సిక్స్ ) మినహా అంతా విఫలమయ్యారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(10) రనౌట్ రూపంలో తొలి వికెట్ గా వెనుదిరిగాడు.

 

ఆ తరువాత దీపక్ హూడా(1), యువరాజ్ సింగ్(10), హెన్రీక్యూస్(18), ఇయాన్ మోర్గాన్(14)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఓ వైపు వార్నర్ ఒంటరి పోరు చేసినా మిగిలిన ఆటగాళ్లు వైఫల్యం చెందడంతో  హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో బ్రాత్ వైట్ కు రెండు వికెట్లు లభించగా, కౌల్టర్ నైల్, జేపీ డుమినీలకు తలో వికెట్ దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement