సుమీత్ సంచలనం | Sumeeth sensation | Sakshi
Sakshi News home page

సుమీత్ సంచలనం

Jul 13 2015 1:28 AM | Updated on Jul 12 2019 3:37 PM

సుమీత్ సంచలనం - Sakshi

సుమీత్ సంచలనం

ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఢిల్లీ కుర్రాడు సుమీత్ నాగల్ జూనియర్ బాలుర డబుల్స్ విభాగంలో టైటిల్ గెలిచాడు.

వింబుల్డన్ బాలుర డబుల్స్ టైటిల్ సొంతం

 లండన్ : ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఢిల్లీ కుర్రాడు సుమీత్ నాగల్ జూనియర్ బాలుర డబుల్స్ విభాగంలో టైటిల్ గెలిచాడు. ఆదివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో సుమీత్-నామ్ హోవాంగ్ లీ(వియత్నాం) ద్వయం 7-6 (7/4), 6-4తో రీలీ ఒపెల్కా (అమెరికా)-అకీరా సాంటిలాన్ (జపాన్) జోడీపై గెలిచింది. ఈ విజయంతో జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఆరో భారతీయ క్రీడాకారుడిగా సుమీత్ గుర్తింపు పొందాడు. గతంలో రామనాథన్ కృష్ణన్ (1954లో వింబుల్డన్), రమేశ్ కృష్ణన్ (1979లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్), లియాండర్ పేస్ (1990లో వింబుల్డన్, 1991లో యూఎస్ ఓపెన్), యూకీ బాంబ్రీ (2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్), సానియా మీర్జా (2003లో వింబుల్డన్ డబుల్స్) ఈ ఘనత సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement