భారత్‌కు చావో.. రేవో | Sultan Ajlan Shah Cup hockey tournament final | Sakshi
Sakshi News home page

భారత్‌కు చావో.. రేవో

Apr 15 2016 1:08 AM | Updated on Sep 3 2017 9:55 PM

భారత్‌కు చావో.. రేవో

భారత్‌కు చావో.. రేవో

సుల్తాన్ అజ్లా న్‌షా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఫైనల్ బెర్త్‌పై దృష్టి సారించిన భారత జట్టు నేడు (శుక్రవారం) కీలక మ్యాచ్ ఆడనుంది.

నేడు మలేసియాతో పోరు  గెలిస్తేనే ఫైనల్‌కు..

ఇపో (మలేసియా): సుల్తాన్ అజ్లా న్‌షా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఫైనల్ బెర్త్‌పై దృష్టి సారించిన భారత జట్టు నేడు (శుక్రవారం) కీలక మ్యాచ్ ఆడనుంది. మలేసియాతో జరిగే ఈ పోరులో సర్దార్ సింగ్ సేన కచ్చితంగా నెగ్గితేనే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. నిజానికి బుధవారం జరిగిన మ్యాచ్‌లో కివీస్‌పై నెగ్గితే భారత్‌కు ఈ మ్యాచ్ నామమాత్రంగానే ఉండేది.

ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం ఆరు మ్యాచ్‌లను పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్న కివీస్‌ను వెనక్కి నెట్టాలంటే భారత్‌కు ఈ మ్యాచ్‌ను గెలవడం తప్ప మరో దారి లేదు. మలేసియాతో ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. అటు మలేసియా ఏడు గోల్స్ తేడాతో భారత్‌ను ఓడిస్తే ఫైనల్‌కు చేరుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement