ఆది నుంచీ వివాదాస్పదమే... | Subject of controversy since the earliest .. | Sakshi
Sakshi News home page

ఆది నుంచీ వివాదాస్పదమే...

Sep 14 2013 1:11 AM | Updated on Sep 1 2017 10:41 PM

జట్టులో ఒకప్పుడు కీలక బౌలర్‌గా ఎదిగిన కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు ఆది నుంచీ దూకుడెక్కువే. తన ప్రవర్తనతో ఎన్నోసార్లు మందలింపునకు గురయ్యాడు.

 సాక్షి క్రీడావిభాగం
 జట్టులో ఒకప్పుడు కీలక బౌలర్‌గా ఎదిగిన కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు ఆది నుంచీ దూకుడెక్కువే. తన ప్రవర్తనతో ఎన్నోసార్లు మందలింపునకు గురయ్యాడు. మైదానంలో ఏమాత్రం ఆవేశం ఆపుకోలేని తత్వంతో వివాదాస్పదంగా మారాడు. కేరళ తరఫున రంజీల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందిన శ్రీ అనవసరంగా ఉద్రేకపడే స్వభావంతో కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసుకున్నాడు.
 
 2005లో చాలెంజర్స్ ట్రోఫీలో దుమ్ము రేపడంతో తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికై ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టుకు ధారాళంగా పరుగులు ఇచ్చినా వికెట్లు తీయగలడని పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్‌లో పంజాబ్‌కు ఆడిన సమయంలో ముంబై ఆటగాడు హర్భజన్ సింగ్‌తో చెంప దెబ్బ తిని వార్తల్లోకెక్కాడు. ఆ తర్వాత కెప్టెన్ ధోని, భజ్జీతో పొసకగపోవడం ఇతడిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. అసలు స్పాట్ ఫిక్సింగ్‌లో శ్రీశాంత్ పాత్ర ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు ప్రకటించినప్పుడు దాదాపు ప్రతీ క్రీడాభిమాని ఆశ్చర్యపోయాడు. నేడు బీసీసీఐ ఈ 30 ఏళ్ల ఆటగాడిపై జీవిత కాలం వేటు వేయడంతో కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement