సింగిల్స్‌ సెమీస్‌లో శుభాంకర్‌ డే | Subhankar enter to semis | Sakshi
Sakshi News home page

సింగిల్స్‌ సెమీస్‌లో శుభాంకర్‌ డే

Nov 3 2018 2:40 AM | Updated on Nov 3 2018 2:40 AM

Subhankar enter to semis - Sakshi

సార్లార్‌లక్స్‌ ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ సూపర్‌–100 టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ ఆటగాడు శుభాంకర్‌ డే సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జర్మనీలోని సార్‌బ్రకెన్‌ నగరంలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శుభాంకర్‌ 21–16, 21–9తో టోబీ పెంటీ (ఇంగ్లండ్‌)పై గెలుపొందాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన పారుపల్లి కశ్యప్‌ 16–21, 18–21తో టోమా జూనియర్‌ పపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శైలి రాణే (భారత్‌) 14–21, 9–21తో లైన్‌ హోమార్క్‌ జార్స్‌ఫెల్డ్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడింది.  

Advertisement
 
Advertisement
Advertisement