ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఇరగదీశాడు! | Steve Smith shows off his skills with a baseball bat | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఇరగదీశాడు!

Jun 28 2017 5:00 PM | Updated on Sep 5 2017 2:42 PM

ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఇరగదీశాడు!

ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఇరగదీశాడు!

ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ ప్రతిభ గురించి ప్రత్యేకంగా క్రికెట్‌ ప్రేమికులకు చెప్పాల్సిన అవసరం లేదు.

న్యూయార్క్‌: ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ ప్రతిభ గురించి ప్రత్యేకంగా క్రికెట్‌ ప్రేమికులకు చెప్పాల్సిన అవసరం లేదు. మైదానం నలుమూలల షాట్లు బాదుతూ పరుగులు పిండుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. స్మిత్‌ వికెట్‌ తీయడానికి బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిబ్బరంగా ఆడుతూ జట్టును గట్టెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. అత్యున్నత ప్రతిభతో స్వల్ప కాలంలోనే ఆసీస్‌ జట్టుకు నాయకుడిగా ఎదిగారు.

న్యూయార్క్‌లో తన బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో స్మిత్‌ పోస్టు చేశారు. ఒక్క బంతిని కూడా వదలకుండా స్మిత్‌ ఆడిన షాట్లు అభిమానులను అలరిస్తున్నాయి. అయితే క్రికెట్‌ బ్యాటుతో కాకుండా సన్నగా ఉండే బేస్‌బాల్‌ బ్యాటుతో ఒక్క బాల్‌ కూడా మిస్‌ కాకుండా స్మిత్‌ కొట్టడం విశేషం. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయినా ఎడమచేతితోనూ బంతిని బలంగా బాదడం మరో విశేషం.

టెస్టుల్లో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న స్మిత్‌ వన్డేల్లో 13వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ ఆడిన ఆయన ఐపీఎల్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గానూ రాణించారు.

 

 

That's outta here ⚾️⚾️⚾️

A post shared by Steve Smith (@steve_smith49) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement