నేటి నుంచి రంజీ ట్రోఫీ క్వార్టర్స్ మ్యాచ్‌లు | starts from today Ranji Trophy! | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రంజీ ట్రోఫీ క్వార్టర్స్ మ్యాచ్‌లు

Feb 3 2016 12:50 AM | Updated on Sep 3 2017 4:49 PM

ఈ సీజన్ రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు నేటి (బుధవారం) నుంచి వివిధ వేదికల్లో జరగనున్నాయి.

విజయనగరం: ఈ సీజన్ రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు నేటి (బుధవారం) నుంచి వివిధ వేదికల్లో జరగనున్నాయి. విదర్భ, సౌరాష్ట్రల మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌కు విజయనగరం ఆతిథ్యమివ్వనుంది. జాతీయ జట్టులో చోటు కోల్పోయిన పేసర్ ఉమేశ్ యాదవ్ ఈ మ్యాచ్‌తో గాడిలో పడాలని భావిస్తుండగా, టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా భారీ స్కోరుపై కన్నేశాడు. వాల్సాద్ (గుజరాత్)లో జరగనున్న  క్వార్టర్‌ఫైనల్లో అస్సాం, పంజాబ్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగాల్, మధ్యప్రదేశ్‌ల క్వార్టర్స్‌కు ముంబై ఆతిథ్యమివ్వనుంది. జార్ఖండ్, ముంబై మ్యాచ్‌కు మైసూర్ వేదిక కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement