పేద పూజారి కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం | Alleged Misconduct by TDP MLA Babynayana Against Poor Priests Family | Sakshi
Sakshi News home page

పేద పూజారి కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం

May 28 2026 4:55 PM | Updated on May 28 2026 5:18 PM

Alleged Misconduct by TDP MLA Babynayana Against Poor Priests Family

అలజంగి(విజయనగరం జిల్లా):  కూటమి ప్రభుత్వ పెద్దల ఆగడాలకు హద్దు అదుపూ లేకుండా పోతోంది. పేదల ఇళ్లనే టార్గెట్‌గా చెలరేగిపోతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు,. అటు పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు..  72 మంది పేదల ఇళ్లను కూల్చివేశారంటూ ఒకవైపు రచ్చ నడుస్తుండగానే విజయనగరం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే బేబీ నాయన కూడా ఇదే ఫాలోవుతున్నట్లు ఉన్నారు. 

విజయనగరం జిల్లా అలజంగిలో  తాజాగా ఓ పేద పూజారి కుటుంబంపై బెదిరింపులకు దిగారు ఎమ్మెల్యే బేబి నాయన.  ఆ పేద పూజారిని ఇళ్లు కూల్చివేస్తామంటూ అధికారుల చేత ఆదేశాలు పంపంచారు. 70 ఏళ్లుగా అక్కడే ఉంటున్న ఆ పూజారి..  విద్యుత్‌ బిల్లులు, పంచాయతీ రశీదులు చూపించినా అధికారులు కనికరించడం లేదు. పైగా ఎమ్మెల్యే బేబీ నాయన కాళ్ల మీద పడితే వదిలేస్తామంటున్నారు అధికారులు.

‘మా ఇళ్లే అడ్చొచ్చాయా..? మమ్మల్ని ఒకసారే చంపేయండి’

Advertisement
 
Advertisement
Advertisement