సెయింట్ ఆండ్రూస్‌కు టైటిల్ | st andrews won title | Sakshi
Sakshi News home page

సెయింట్ ఆండ్రూస్‌కు టైటిల్

Jan 20 2014 1:20 AM | Updated on Oct 2 2018 8:39 PM

సచ్‌దేవ్ స్పోర్ట్స్ ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ జట్టు చేజిక్కించుకుంది.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సచ్‌దేవ్ స్పోర్ట్స్ ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ జట్టు చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ జట్టు పెనాల్టీ షూటవుట్ ద్వారా 2-1 స్కోరుతో రామకృష్ణపురానికి చెందిన భవాన్స్ స్కూల్ జట్టుపై విజయం సాధించింది.
 
  సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ జట్టు తరఫున ప్రద్యుమ్న, భరత్ కీలకమైన గోల్స్ చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు. భవాన్స్ కాలేజి జట్టులో మయూర్ గోల్ చేశాడు. ఈ టోర్నీలో బెస్ట్ గోల్ కీపర్‌గా విష్రుత్, బెస్ట్ డిఫెండర్‌గా నరేష్ (సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్), బెస్ట్ మిడ్ ఫీల్డర్‌గా సాయిరామ్ (భవాన్స్ స్కూల్), బెస్ట్ స్ట్రయికర్‌గా కిరణ్(గవర్నమెంట్ హైస్కూల్, లాల్‌బజార్) అవార్డులు అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement